1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 3 మార్చి 2017 (13:40 IST)

రామ్ చరణ్ బద్ధకస్థుడు.. శర్వానంద్ సహజ నటుడు..: పవిత్రా లోకేశ్ షాకింగ్ కామెంట్స్

పవిత్రా లోకేశ్. కన్నడ నటి. కానీ, తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఎక్కువ అవకాశాలు కొట్టేస్తున్నారు. అనేక చిత్రాల్లో హీరో, హీరోయిన్లకు తల్లిగా నటిస్తూ మంచి మార్కులు తన ఖాతాలో వేసుకుంటోంది. ప్రస్తుతం 'కాటమరాయుడ

పవిత్రా లోకేశ్. కన్నడ నటి. కానీ, తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఎక్కువ అవకాశాలు కొట్టేస్తున్నారు. అనేక చిత్రాల్లో హీరో, హీరోయిన్లకు తల్లిగా నటిస్తూ మంచి మార్కులు తన ఖాతాలో వేసుకుంటోంది. ప్రస్తుతం 'కాటమరాయుడు'లో శ్రుతిహాసన్‌కు, 'దువ్వాడ జగన్నాథం'లో అల్లు అర్జున్‌కు తల్లిగా నటిస్తోంది. 
 
తాజాగా ఆమె తల్లిగా నటించిన ఆ యంగ్ హీరోల గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కాస్తంత బద్ధకస్థుడని, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎప్పుడూ తనను టీజ్ చేస్తుంటాడని, శర్వానంద్ సహజనటుడంటూ చెప్పుకొచ్చింది. 
 
'రామ్ చరణ్ బద్ధకస్థుడు. నీకింకా పిల్లలొద్దా.. ఎప్పుడు కంటావు? అని అడిగినప్పుడల్లా.. 'నేనే ఓ పిల్లాడిని. నాకెందుకు పిల్లలు. అయినా అప్పుడే నాకు పిల్లలేంటి' అని చెప్పేవాడు. ఇక బన్నీ నన్ను స్వీట్ మదర్ అంటూ టీజ్ చేస్తుంటాడు' అని చెప్పింది పవిత్ర. కాగా, శర్వానంద్ సహజ నటుడని, తన నటనను మరింత సానబట్టేందుకు ప్రయత్నిస్తుంటాడని కితాబిచ్చింది.