బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 2 జనవరి 2023 (16:11 IST)

ఎర్లీ ఏజ్‌లో పెళ్లి చేసుకుని తప్పు చేశా : నటి ప్రగతి

pragathi
అన్నీ తనకే తెలుసన్న అహంభావంతో ఎర్లీ ఏజ్‌లో పెళ్లి చేసుకుని తప్పు చేశానని, అందుకే హీరోయిన్‌గా నిలదొక్కుకోలేక పోయినట్టు నటి ప్రగతి అన్నారు. తెలుగు చిత్రపరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తూ, మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్న నటి ప్రగతి. అమ్మ, అక్క, వదిన వంటి పాత్రలతో పాపులర్ అయ్యారు. పైగా, సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్‌గా రాణించలేక పోవడానికి గల కారణాలను ఆమె వివరించారు. 
 
హీరోయిన్‌గా నా జీవితం సాఫీగా సాగిపోతున్న తరుణంలో నేను తీసుకున్న నిర్ణయం, నా కెరియర్‌ను పది నుంచి 20 యేళ్లకు వెనక్కి తీసుకెళ్లింది. నేను చేసిన చిన్న పొరపాటు కారణంగానే అలా జరిగింది. ఎర్లీ ఏజ్‌లో పెళ్లి చేసుకున్నాను. అలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం వెనుక కోపం, అమాయకత్వం, మూర్ఖత్వం వంటివి ఉంటాయి. అన్నీ తనకే తెలుసు అనే ఒక అహంభావం కూడా ఆ ఏజ్‌లో ఉంటుంది. 
 
పరిస్థితులు కల్పించుకుని మరీ మనం అనుకున్నది జరగాలని కోరుకుంటాం. చేసింది తప్పు అని  గ్రహించే లేపు మన చేతులు దాటిపోతుంది. పైగా, దాని నుంచి బయటపడేందుకు ఎంతో సమయం పడుతుంది. అది కూడా అంత ఆషామాషీ కాదు. నేను క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన తర్వాత కెరీర్‌పై ఎంత దృష్టిసారించానే.. హీరోయిన్‌గా చేసేటపుడు కూడా అంతే శ్రద్ధ, నిబద్ధతో పని చేసివుంటే నా జీవితం మరోలా ఉండేది అని ప్రగతి తన మనసులోని మాటను  బహిర్గతం చేసింది.