మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 అక్టోబరు 2020 (21:44 IST)

పునర్నవి వేలికి రింగు పెట్టిన వ్యక్తి ఎవరబ్బా?

సినీ నటి, బిగ్ బాస్-3 కంటెస్టెంట్ పునర్నవి పెళ్లి ఫిక్స్ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా బుధవారం ప్రకటించింది. 'ఫైనల్లీ ఇట్స్ హ్యాపెనింగ్ (చివరకు జరగబోతోంది)' అని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. తనకు కాబోయే భర్త తన చేతిని పట్టుకున్న ఫొటోను షేర్ చేసింది. అయితే ఈ ఫొటోలో తన ఫియాన్సీ ముఖాన్ని చూపించకుండా, అందరినీ సస్పెన్స్‌లో ఉంచింది.
 
నిజానికి బిగ్ బాస్‌లో రాహుల్ సిప్లిగంజ్‌తో పునర్నవి లవ్ ట్రాక్ నడిపింది. ఇద్దరూ కూడా చాలా క్లోజ్‌గా ఉంటూ జనాల్లో ఆసక్తిని పెంచారు. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారేమోనని ప్రేక్షకులు అనుకున్నారు. 
 
అయితే, తాము స్నేహితులం మాత్రమేనని ఇద్దరూ  చెప్పుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో పునర్నవి తన పెళ్లి గురించి అనౌన్స్ చేసింది. అయితే వరుడు ఎవరో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాలి.
 
అయితే, బిగ్ బాస్ సీజన్ 3లో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచిన ఈ భామ... ప్ర‌స్తుతం ప‌లు సినిమాలు, వెబ్ షోస్‌తో బిజీగా ఉందీ భామ‌. అయితే త‌న‌కు నిశ్చితార్థం పూర్త‌యింది.. త్వ‌ర‌లోనే పెళ్లి అంటూ చెప్ప‌క‌నే చెప్తూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టి అంద‌రినీ షాక్‌కు గురి చేసింది పున‌ర్న‌వి.
 
అయితే తన చేయి ప‌ట్టుకుని రింగ్ తొడిగిన ఆ వ్య‌క్తి ఎవ‌రో మాత్రం చెప్ప‌లేదు. వెబ్ షో, సినిమా ప్ర‌మోష‌న్స్ కోస‌మే పున‌ర్న‌వి ఇలా ఎంగేజ్మెంట్ అయిన‌ట్టు చెప్పిందా..? లేదంటే నిజంగానే నిశ్చితార్థం పూర్త‌యిందా..? అనే విష‌యంపై స‌స్పెన్స్ నెల‌కొంది. రానున్న రోజుల్లో ఏది నిజ‌మో తెలుస్తోంది. అప్ప‌టివ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.