శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 మార్చి 2020 (11:20 IST)

బిగ్ బాస్ విన్నర్ రాహుల్‌పై బీరు సీసాలతో దాడి.. తలకు గాయం.. ఆ గర్ల్ ఫ్రెండ్ ఎవరు?

బిగ్ బాస్ మూడో సీజన్‌లో విజేతగా నిలిచిన హైదరాబాదీ పాతబస్తీ యువకుడు, సింగర్ రాహుల్ సిప్లగింజ్‌పై హేయంగా దాడి జరిగింది. గత రాత్రి గచ్చిబౌలిలో ప్రిజమ్ పబ్‌కి తన గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి వెళ్లగా.. అక్కడ ఆమెపై కొంతమంది యువకులు అనుచితంగా ప్రవర్తించారు.

దీంతో పక్కనే రాహుల్.. వాళ్లను నిలదీయగా.. ఆ యువకులు ఎదురు తిరిగి బీరు సీసాలతో తలపై బాదగా.. తీవ్ర రక్త స్రావంతో రాహుల్ గాయాలపాలైయ్యాడు.
 
దీంతో పబ్ సిబ్బంది రాహుల్‌ను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతన్ని పరీక్షించి చికిత్స అందిస్తున్నారు. రాహుల్ తలకు తీవ్రంగానే గాయాలైనట్టు సమాచారం. దాడి చేసిన వారిలో వికారాబాద్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బంధువులు ఉన్నట్టు సమాచారం. దాడి ఘటనపై సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
రాహుల్ పై దాడి జరగడంతో వాళ్ల కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాహుల్ సిప్లిగంజ్.. కృష్ణవంశీ దర్శకత్వంలో ''రంగ మార్తాండ'' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాగా పబ్ ఘటనలో రాహుల్‌తో వున్నదెవరు.. గర్ల్ ఫ్రెండ్ ఎవరనేదానిపై చర్చ సాగుతోంది.