శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 జనవరి 2020 (13:27 IST)

పూజా హెగ్డేను ఓ ఆట ఆడుకుంటున్న నెటిజన్లు.. ఎందుకో తెలుసా? (video)

అల వైకుంఠపురంలో హీరోయిన్ పూజా హెగ్డే ఓ విషయంలో అడ్డంగా బుక్కైంది. ఆమెను నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. ఎందుకంటే..? వైజాగ్ వేదికగా అల వైకుంఠపురంలో సక్సెస్ మీట్ అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో తల్లిదండ్రులతో పాటు పూజా హెగ్డే పాల్గొంది. అల వైకుంఠపురంలో చిత్ర ప్రమోషన్స్ కార్యక్రమాలలో తరచుగా పొట్టి గౌనులలో పాల్గొన్న పూజా ఈ వేడుకకు మాత్రం నిలువెత్తు చీరలో సంప్రదాయంగా హాజరైంది. 
 
కాగా మూవీ సక్సెస్ గురించి మాట్లాడటానికి వేదికపైకి వెళ్లిన పూజ, అల వైకుంఠపురంలో చిత్రంలోని బ్లాక్ బస్టర్ సాంగ్ సామజవరగమనా సాంగ్ పాడటం మొదలుపెట్టింది. వెనుకే ఉన్న థమన్ ఆమె పాటకి తగ్గట్టుగా బీట్ అందుకున్నాడు. 
 
ఐతే ఆమె పాటకు, ఈయన బీటుకు పొంతన లేకపోవడంతో నవ్వాలో ఏడవాలో థమన్‌కి అర్థం కాలేదు. నాలుక తిరగని తెలుగు పాదాలను నమిలేస్తూ…శృతిని చంపేసి ఆమె పాడిన తీరుకు సభ మొత్తం షాక్ తింది. ఈ పాట విన్న నెటిజన్లు సోషల్ మీడియాలో పూజాను ఏకిపారేస్తున్నారు. .వాళ్లకు నచ్చిన విధంగా మీమ్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. పూజా పాడిన ఆ వీడియో చూస్తే మీకే అసలు విషయం అర్థమైపోతుంది.