శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 జనవరి 2020 (13:02 IST)

#AlaVaikunthapurramulooTrailer సోసోగానే వుందా..?

ఏదైనా  పుట్టించే శక్తి వాళ్లకే ఉంది సార్.. ఒకటి నేలకి.. ఇంకోటి వాళ్లకి.. వాళ్లతో మనకెందుకు గొడవ అంటూ బన్నీ చెప్పే సూపర్ డైలాగులతో నిండిన అల వైకుంఠపురంలో ట్రైలర్ విడుదల అయ్యింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆడవారి గొప్ప తనాన్ని చెబుతూ బ్రహ్మాజీకి బన్నీ వార్నింగ్ ఇవ్వడం కూడా మంచి రెస్పాన్స్ పట్టేసింది.
 
కానీ ఈ ట్రైలర్‌లో అక్కడక్కడ పాత సినిమాల పోలికలున్నాయని టాక్ వస్తోంది. అంతేకాకుండా మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' ట్రైలర్‌తో పోల్చిచూస్తే 'అల..వైకుంఠపురములో' ట్రైలర్ సో సోగానే ఉందని నెటిజన్లు అంటున్నారు.

ట్రైలర్ విషయంలో మిస్ ఫెయిర్ అయిన త్రివిక్రమ్ సినిమాతో నైనా మెరుపులు మెరిపిస్తాడని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ అల వైకుంఠపురంలో ట్రైలర్ యూట్యూబ్ ట్రెండింగ్‌లో రెండో స్థానంలో నిలిచింది. ఇకపోతే.. జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది.