పెళ్లయ్యాక కూడా మా నాన్నతోనే కలిసి వుంటానని నా భార్యకు కండిషన్ పెట్టా: అల్లు అర్జున్
అల వైకుంఠపురంలో ప్రమోషనల్ ప్రోగ్రామ్ ఈవెంట్లో అల్లు అర్జున్ ఎమోషనల్‌గా మాట్లాడారు. తన తండ్రి అరవింద్ గురుంచి చెపుతూ భావోద్వేగానికి గురయ్యాడు. అంతేకాదు కంటతడి పెట్టాడు. ఇండియాలోనే నెంబర్ వన్ ప్రొడ్యూసర్‌గా ఉన్న తన తండ్రిపై దుష్ప్రచారం ఎక్కువగా జరిగిందని చెప్పుకొచ్చాడు.
మార్కెట్లో 10 రూపాయల వస్తువును నాన్న 7 రూపాయలకు కొనడానికి ట్రై చేస్తాడు. అంతేకానీ 6 రూపాయలకు ఇస్తానన్నా కానీ తీసుకోడు అని చెప్పాడు. ఇప్పటివరకు ఎప్పుడూ తన తండ్రి గురించి మాట్లాడలేదంటూ ఆయనలాగా ఉండేందుకు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చారు. సినిమా రంగానికి ఆయన చేసిన సేవకు పద్మశ్రీ పురస్కారానికి అర్హుడని ఆయనకు అవార్డు దక్కేలా చూడాలని రెండు తెలుగురాష్ట్రాల ప్రభుత్వాలను కోరాడు అర్జున్.
తన భార్యతో పెళ్ళికి ముందు తాను పెట్టిన ఒకే ఒక కండిషన్, పిల్లల పుట్టాక కూడా తన తండ్రితో పాటు కలిసి ఉంటానని చెప్పడమేనని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. ఇక తమ అభిమాన హీరో అల్లు అర్జున్ స్టేజ్ మీదనే కంటతడి పెట్టుకోవడంతో ఆయన అభిమానులు కూడా తల్లడిల్లిపోయారు.