శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 31 డిశెంబరు 2019 (14:40 IST)

#AlaVaikunthapurramuloo #సామజవరగమన వీడియో ప్రోమో.. వీడియో

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఇది మ్యూజికల్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సామజవర గమన పాట సూపర్ హిట్ అవ్వడంతో ఈ పాట‌ షూటింగ్‌కు ఆరు కోట్లు వరకు ఖ‌ర్చు చేశారట చిత్ర యూనిట్. లేటెస్ట్‌గా ఈ పాటకు సంబంధించిన వీడియో సాంగ్ విడుదల చేసింది చిత్రయూనిట్. 
 
వీడియోలో పాటకు అల్లూ అర్జున్ వేసిన ఫ్లోర్ స్టెప్పులు అదిరిపోయాయి. ఇక జనవరి 6న యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ‘అల వైకుంఠపురంలో మ్యూజికల్ కాన్సెర్ట్’ను వైభవంగా, వినూత్నంగా జరుపనున్నారు. సామజవర గమన పాట సూపర్ హిట్ అవ్వడంతో ఈ పాట‌ షూటింగ్‌కు ఆరు కోట్లు వరకు ఖ‌ర్చు చేశారట చిత్ర యూనిట్. 
 
లేటెస్ట్‌గా ఈ పాటకు సంబంధించిన వీడియో సాంగ్ విడుదల చేసింది చిత్రయూనిట్. వీడియోలో పాటకు అల్లూ అర్జున్ వేసిన ఫ్లోర్ స్టెప్పులు అదిరిపోయాయి. 
 
ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్‌కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
 
హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్, గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 12న ఈ చిత్రం విడుద‌ల‌వుతుంది.