1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 జూన్ 2021 (20:49 IST)

లాక్డౌన్‌లో పెళ్లి చేసుకున్న కన్నడ హీరోయిన్ సంజనా గల్రానీ

కన్నడ సినీ పరిశ్రమకు చెందిన సంజన గల్రానీ ఆ చిత్ర పరిశ్రమను కుదిపేసిన డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంది. పోలీసుల విచారణకు కూడా ఆమె హాజరైంది. ఈ నేపథ్యంలో ఆమె పెళ్లిపీటలెక్కింది. లాక్డౌన్ సమయంలోని గుట్టుచప్పుడు కాకుండా పెళ్లితంతును ముగించినట్టు ఆమె తాజాగా సంచలన ప్రకటన చేసింది. 
 
తాను వివాహం చేసుకున్నట్టు ప్రకటించింది. నిజానికీ ఈ వివాహం గత ఏడాది లాక్డౌన్ సమయంలోనే జరిగిందని ఇప్పటి దాకా దాచిన సీక్రెట్‌ను బయటపెట్టింది. బెంగళూరులోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో డాక్టరైన అజీజ్ పాషాను పెళ్లాడినట్టు చెప్పింది. 
 
పెళ్లి చేసుకున్న వెంటనే... కొన్ని పోలీసు కేసులతో ఇబ్బంది పడ్డానని తెలిపింది. అందిరినీ ఆహ్వానించి రిసెప్షన్ ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ... ప్రస్తుత లాక్డౌన్ వల్ల అది సాధ్యం కాలేదని చెప్పింది.
 
నిజానికి పెళ్లి జరిగిన తర్వాత పెళ్లి ఫోటోలు కొన్ని బయటకు వచ్చాయి. కానీ, ఇవి ఫేక్ ఫోటోలంటూ ఆమె కొట్టిపారేశారు. కానీ, ఇప్పుడు వాస్తవాన్ని ఆమె ప్రకటించింది. మరోవైపు కరోనా సమయంలో ఎందరో అభాగ్యులను సంజన ఆదుకుంది. ఎందరికో ఆహారాన్ని అందించింది.