ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 11 మార్చి 2018 (17:06 IST)

కమల్ హాసన్ పార్టీలో చేరేందుకు సిద్ధం : సెక్సీ హీరోయిన్ షకీలా

విశ్వనటుడు కమల్ హాసన్ ఇటీవల 'మక్కల్ నీది మయ్యం' అనే పార్టీని స్థాపించి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. అయితే, ఈ పార్టీలో చేరేందుకు పలువురు హీరోయిన్లు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి వారిలో సెక

విశ్వనటుడు కమల్ హాసన్ ఇటీవల 'మక్కల్ నీది మయ్యం' అనే పార్టీని స్థాపించి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. అయితే, ఈ పార్టీలో చేరేందుకు పలువురు హీరోయిన్లు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి వారిలో సెక్సీ నటి షకీలా అన్నారు. 
 
తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ, ప్రజలను విద్యావంతులను, చైతన్య వంతులను చేయాలని కమల్ హాసన్ తరచుగా చెబుతుంటారని అన్నారు. ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పిచండం ద్వారా సమాజంలో ఎంతో మార్పు తేవచ్చనే కమల్ ఉద్దేశ్యాన్ని తాను సమర్థిస్తానని చెప్పుకొచ్చారు. 
 
ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే కమల్ రాజకీయాల్లోకి వచ్చారని, ఆ విషయాన్ని పట్టించుకోకుండా, ఆయనపై విమర్శలు గుప్పించడం తగదన్నారు. కాగా, షకీలా నటించిన 250వ చిత్రం 'శీలవతి'. ఈ చిత్రం టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు.