1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 12 జులై 2016 (15:30 IST)

అంగాంగ ప్రదర్శన చేసినా, దర్శకనిర్మాతలకు సహకరించినా టాప్ హీరోయిన్ కాలేకపోయా.. తాప్సీ

సిల్వర్ స్క్రీన్‌పై అంగాంగ ప్రదర్శన చేస్తూ.. హీరోలకు, దర్శకనిర్మాతలకు సహకరించినా టాప్ హీరోయిన్ కాలేక పోయినట్టు అందాల ముద్దుగుమ్మ తాప్సీ వాపోయింది. ముఖ్యంగా.. బహుభాషా చిత్రాల్లో నటించినప్పటికీ చిత్రపరి

సిల్వర్ స్క్రీన్‌పై అంగాంగ ప్రదర్శన చేస్తూ.. హీరోలకు, దర్శకనిర్మాతలకు సహకరించినా టాప్ హీరోయిన్ కాలేక పోయినట్టు అందాల ముద్దుగుమ్మ తాప్సీ వాపోయింది. ముఖ్యంగా.. బహుభాషా చిత్రాల్లో నటించినప్పటికీ చిత్రపరిశ్రమలో నిలదొక్కుకోలేక పోయినట్టు చెప్పుకొచ్చింది.
 
ఢిల్లీకి చెందిన తాప్సీ... తమిళంలో ధనుష్ సరసన 'ఆడుగళం' చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత కూడా జీవా తదితర పలువురు యువ నటులకు జంటగా నటించారు. ఇటీవల 'కాంచన-2'లో లారెన్స్‌తో నటించి విజయాన్ని అందుకున్నారు. అదే విధంగా తెలుగు, మలయాళం, హిందీ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించారు.
 
తెలుగులో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన "ఝుమ్మంది నాదం" చిత్రం ద్వారా దిగుమతి అయ్యారు. ఇలా బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్నా టాప్ నాయికల వరుసలో చేరలేకపోయారు. ఇది తనకు బాధాకరమైన విషయమేనంటున్న తాప్సీ ప్రముఖ హీరోల సరసన నటిస్తేనే తగినంత ప్రాచూర్యం లభిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.