శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 10 డిశెంబరు 2018 (18:05 IST)

కలియుగ పాండవులు చేసేటప్పుడు.. అలా జరిగింది- నిర్మాతలు ఒక్కరాత్రి కోసం..? ఖుష్బూ

క్యాస్టింగ్ కౌచ్‌పై సినీ నటి, కాంగ్రెస్ నేత ఖుష్బూ నోరు విప్పింది. సాధారణంగా నిర్మాతలు ఎవ్వరూ ఒక్కరాత్రి కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టరని ఖుష్బూ తేల్చేసింది. సినిమాలు తీసే ఆలోచన లేని వ్యక్తులే అలాంటి పనులు చేస్తారని ఖుష్బూ స్పష్టం చేశారు. కేవలం సినీ పరిశ్రమలోనే కాకుండా అన్నీ రంగాల్లోనూ క్యాస్టింగ్ కౌచ్ భూతం వుందన్నారు. 
 
కానీ సినీ పరిశ్రమ కావడంతో అది వెంటనే పబ్లిసిటీ అవుతుందని ఖుష్బూ వెల్లడించారు. ఎనిమిదేళ్ల వయస్సుల్లో సినీ ఇండస్ట్రీకి వచ్చానని..నాలుగైదు భాషల్లో నటించినా తనకు లైంగిక వేధింపులు ఎదురుకాలేదన్నారు. అయితే కలియుగ పాండవులు సినిమా చేసేటప్పుడు మాత్రం ఓ హాస్టల్‌లో తాను మెట్లు ఎక్కి వెళ్తుండగా ఒకడు అభ్యంతరకంగా తాకాడని ఖుష్బూ గుర్తు చేసుకున్నారు. 
 
వెంటనే అతని కాలర్ పట్టుకుని రెండు చెంపలు పగులకొట్టానని తెలిపారు. ఆ సమయంలో షూటింగ్ జరుగుతున్న గ్రామ ప్రజలు, హీరో వెంకటేశ్, ప్రొడ్యూసర్ సురేశ్ బాబు, టెక్నీషియన్స్ అందరూ తనకు అండగా నిలబడ్డారని వెల్లడించారు. లైంగిక వేధింపులకు గురికాకుండా తనకు అలాంటి ప్లాట్ ఫామ్ దొరికిందని చెప్పారు.