సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

ఘోర రోడ్డు ప్రమాదం : నటి యాషికా ఆనంద్ తీవ్రగాయాలు

తమిళనాడు రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నటి యాషికా ఆనంద్‌కు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే ప్రమాదంలో ఆమె స్నేహితుల్లో ఒకరు మృత్యువాతపడగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావడం గమనార్హం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మామల్లపురం జరిగిన రోడ్డు ప్రమాదంలో బిగ్‌బాస్ ఫేమ్ యషికా ఆనంద్ సహా ఇద్దరు గాయపడ్డారు. యషిక స్నేహితురాలైన హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వల్లిశెట్టి భవాని అక్కడికక్కడే మృతి చెందింది. 
 
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన యషికతోపాటు మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం చెన్నై తరలించారు. అక్కడ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యషిక పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. 
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మద్యం మత్తులో వేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం సంభవించినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బిగ్‌బాస్ షోతో ఫేమస్ అయిన యషిక మోడల్‌గానూ రాణిస్తోంది.