మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 31 మార్చి 2021 (14:52 IST)

హరిహరవీరమల్లు సెట్స్‌లో ప్రమాదం.. ఆదిత్యమీనన్‌కు గాయాలు..

Adithya menon
టాలీవుడ్ యాక్టర్ పవన్‌కల్యాణ్ లీడ్ రోల్‌లో నటిస్తోన్న చిత్రం హరిహరవీరమల్లు. ఈ మూవీ సెట్స్ లో ప్రమాదం జరిగినట్టు ఫిలింనగర్ లో వార్త చక్కర్లు కొడుతోంది. క్రిష్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి కీ షెడ్యూల్ షూట్ చేస్తుండగా ప్రముఖ నటుడు ఆదిత్యమీనన్ గుర్రం మీద నుండి ఫ్లోర్ పై పడిపోయినట్టు తెలుస్తోంది. గాయాలైన ఆదిత్యమీనన్‌ను వెంటనే ముంబైలోని యశోద ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.
 
కొన్ని రోజుల కిత్రం ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోండగా.. ఆదిత్యమీనన్‌ను చెన్నై ఆస్పత్రికి మార్చినట్టు సమాచారం. ప్రస్తుతం ఆదిత్యమీనన్‌కు చికిత్స కొనసాగుతుందని, ఆయన కోలుకుంటున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. 2009లో మెహర్ రమేశ్ డైరెక్షన్‌లో వచ్చిన బిల్లా సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు ఆదిత్య మీనన్‌. ప్రస్తుతం సంధ్యారాజు నటిస్తోన్న నాట్యం చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు ఆదిత్యమీనన్‌.