గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 సెప్టెంబరు 2024 (17:08 IST)

పెళ్లి బంధంతో ఒకటైన సిద్ధార్థ్ - అదితి రావు హైదరీ

aditirao hydari - siddharth
పెళ్లి బంధంతో హీరోహీరోయిన్ సిద్ధార్థ్, అదితి రావు హైదరీ ఒక్కటయ్యారు. సౌత్ ఇండియన్ సంప్రదాయ పద్దతిలో వివాహం జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సిద్ధార్థ్, అదితి పెళ్లి జరిగింది. తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వివాహ బంధాన్ని సిద్ధార్థ్ అదితి అధికారికంగా ప్రకటించింది. 
 
నా సూర్యుడు నువ్వే.. నా చంద్రుడు నువ్వే.. నా నక్షత్రాలన్నీ నువ్వే” అంటూ అందమైన క్యాప్షన్‌తో సిద్ధార్థ్‌పై ప్రేమను అదితి వ్యక్తం చేసింది. ప్రస్తుతం సిద్ధార్థ్, అదితి పెళ్లి ఫోటోస్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. నూతన వధూవరులకు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు.