ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 28 జూన్ 2022 (19:09 IST)

అదో వేస్ట్ సినిమా దాని వ‌ల్ల అవ‌కాశాలు పోయాయి - పూజా హెగ్డే కామెంట్‌

Pooja Hegde
Pooja Hegde
పూజా హెగ్డే ఇప్పుడు క్రేజీ హీరోయిన్ అయిపోయింది. ఎన్‌.టి.ఆర్‌.తో అర‌వింద స‌మేత సినిమా చేశాక ఆమె కెరీర్ ఒక్క‌సారిగా ఊపందుకుంది. ఆ త‌ర్వాత ప‌లు విజ‌య‌వంత‌మైన సినిమాలు చేసింది. ఇక అల్లు అర్జున్‌తో చేసిన అల వైకుంఠ‌పురంలో గురించి తెలిసిందే. క‌రోనా టైంలో కూడా బాక్సీఫీస్ హిట్ కొట్టింది. ఇక ఆ త‌ర్వాత విజ‌య్‌తో బీస్ట్ చిత్రం చేసింది ప‌ర్వాలేదు అనిపించింది. కానీ చిరంజీవితో ఆచార్య‌, ప్ర‌భాస్‌తో రాధేశ్యామ్ చిత్రాలు చేసింది. అవి పెద్ద‌గా ప్ర‌జాద‌ర‌ణ పొందలేదు. త్వ‌ర‌గానే ఓటీటీలోకి వ‌చ్చేశాంయి. 
 
అయితే ఇటీవ‌లే ఓ ఇంట‌ర్వ్యూలో త‌న కెరీర్ గురించి విశ్లేషిస్తూ, బాగా ఎచీవ్ అయిన సంద‌ర్భాలు, బాగా లాస్ అయిన సంద‌ర్భాలు చెప్ప‌మ‌న్న‌ప్పుడు ఆమె ఇలా పేర్కొంది. నేను వ‌రుస‌గా ఆరు సినిమాలు హిట్ కొట్ట‌డం బిగ్గెస్ట్ ఎచీవ్ మెంట్‌. బాగా లాస్ అయింది. మెంట‌ల్‌గా డిస్ట‌బ్ అయింది. మొహంజ‌దారో సినిమాకే. హృతిక్ రోష‌న్ సినిమా అనేస‌రికి చేశాను. కానీ ఆ సినిమా డిజాస్ట‌ర్‌గా మారింది. ఆ సినిమా ఎఫెక్ట్‌కు ఏడాది పాటు నాకు సినిమాలు రాలేదు. చాలా మెంట‌ల్‌గా డిస్ట‌బ్ అయ్యానంటూ పేర్కొంది. పూజా మాట‌లు నెట్టింట బాగా వైర‌ల్ అవుతున్నాయి.