గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 27 జూన్ 2022 (17:26 IST)

పంచ‌తంత్ర క‌థ‌లు చిత్రంలో వీడియోసాంగ్ రిలీజ్ చేసిన త‌రుణ్ భాస్క‌ర్‌.

Panchatantra Kathalu, Tarun Bhaskar
Panchatantra Kathalu, Tarun Bhaskar
నేనేమో మోతెవ‌రి..నువ్వేమో తోతాప‌రి...
నా గుండెల స‌రాస‌రి..కుర్సియేసి కూసొబెడ‌త‌నే...
నీ అయ్యా ప‌ట్వారి..నీ చిచ్చా దార్కారి...
ఏదైతే ఏందే మ‌రి...నిన్నుఎత్తుకొనిబోత‌నే...అంటూ ఆహ్లాద‌ర‌క‌రంగా సాగే ఈ పాట `పంచతంత్ర క‌థ‌లు` చిత్రంలోనిది. మ‌ధు క్రియేష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త డి. మ‌ధు నిర్మిస్తున్నారు. గంగ‌న‌మోని శేఖ‌ర్ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. ఐదు వేరు వేరు క‌థ‌ల‌ ఆంథాల‌జి కావ‌డంతో ఈ మూవీకి `పంచ‌తంత్ర క‌థ‌లు` అనే యాప్ట్ టైటిల్ పెట్ట‌డం జ‌రిగింది. ప్ర‌స్తుతం సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని విడుద‌ల‌కి సిద్దంగా ఉన్న ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా మొద‌టి పాట `మోతెవ‌రి` లిరిక‌ల్ వీడియో సాంగ్ ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ విడుద‌ల చేశారు.
 
ఈ పాట‌కు కాస‌ర్ల శ్యామ్ మంచి సాహిత్యం అందించ‌గా సంగీత ద‌ర్శ‌కుడు క‌మ్రాన్ క్యాచీ ట్యూన్‌తో స్వ‌ర‌పరిచాడు. ఇక లేటెస్ట్ సెన్సేష‌న్ రామ్ మిరియాల ఈ పాట‌ను త‌న‌దైన శైలిలో ఆల‌పించి ఇన్‌స్టంట్ చార్ట్ బ‌స్ట‌ర్  లీస్ట్‌లో చేర్చారు. ప్ర‌స్తుతం ఈ పాట సోష‌ల్ మీడియాలో అద్భుత‌మైన రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. సాంగ్ విడుద‌ల సంద‌ర్భంగా..
 
ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ మాట్లాడుతూ - ``పంచ‌తంత్ర క‌థ‌లు సినిమాలోని `నేనేమో మోతెవ‌రి` సాంగ్ రిలీజ్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. ఇది నా ఫేవ‌రేట్ సాంగ్‌. ఈ సినిమా ర‌ఫ్ క‌ట్ చూసిన‌ప్పుడే ఈ సాంగ్ విన‌డం జ‌రిగింది. చాలా ఇన్స్‌పైరింగ్ సాంగ్‌. త‌ప్ప‌కుండా వైర‌ల్ అవుతుంద‌ని నా న‌మ్మ‌కం. కాస‌ర్ల శ్యామ్ గారు మంచి సాహిత్యం అందించారు. రామ్ మిరియాల అంద‌రి ఫేవ‌రేట్‌. ఇక సంగీత ద‌ర్శ‌కుడు కమ్రాన్ చాలా కాలంగా తెలుసు. మంచి ట్యూన్ ఇచ్చారు. లిరిక‌ల్ వీడియోలో ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ మేకింగ్‌, విజువ‌ల్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమాలో చాలా పెద్ద‌ క్యాస్టింగ్ ఉంది. స‌ర్‌ప్రైజింగ్‌గా  మా అమ్మ‌గారితో కూడా ఒక క్యారెక్ట‌ర్ చేయించారు. ఈ సినిమా కోసం ఎగ్జ‌యిటింగ్‌గా ఉన్నాను. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.  
 
తారాగ‌ణం: నోయెల్, నందిని రాయ్‌, సాయి రోనక్‌, గీత భాస్క‌ర్‌, ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్‌, నిహాల్ కోద‌ర్తి, సాదియ‌, అజ‌య్ క‌తుర్వ‌ర్ త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం:
నిర్మాణ సంస్థ‌: మ‌ధు క్రియేష‌న్స్‌
నిర్మాత‌: డి. మ‌ధు
ర‌చ‌న‌-ద‌ర్శక‌త్వం: గంగ‌న‌మోని శేఖ‌ర్‌
సంగీతం: క‌మ్రాన్‌
కో ప్రొడ్యూస‌ర్‌: డి. ర‌వీంద‌ర్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: పాల‌కూరి సాయికుమార్‌
మాట‌లు, లైన్ ప్రొడ్యూస‌ర్‌: అజ‌ర్ షేక్‌
సినిమాటోగ్ర‌ఫి: గంగ‌న‌మోని శేఖ‌ర్‌, విజ‌య్ భాస్క‌ర్ స‌ద్దల‌
ఎడిట‌ర్‌: శ్రీ‌నివాస్ వ‌ర‌గంటి
కాస్టూమ్ డిజైన‌ర్, స్టైలిస్ట్‌:  రితీషా రెడ్డి
సౌండ్ డిజైన‌ర్‌: నాగార్జున తాళ్ల‌ప‌ల్లి
లిరిక్స్‌: సుద్దాల అశోక్ తేజ‌, కాస‌ర్ల శ్యాం, మామా సింగ్‌
పిఆర్ఓ: శ్రీను దుద్ది, సిద్ధు