స్క్రిప్టు నచ్చితే ఎలాగైనా నటిస్తా.. పరిమితులంటూ ఉండవు : సన్నీ లియోన్
తనకు సినిమా స్క్రిప్టు నచ్చితే ఎలాగైనా నటిస్తానని, ఇందుకోసం పరిమితులంటూ ఉండవని బాలీవుడ్ హీరోయిన్‌గా మారిన పోర్న్ స్టార్ సన్నీ లియోన్ వ్యాఖ్యానించారు. తాజాగా 'రాయీస్' చిత్రంలో 'లైలా మై లైలా.. ' పాటలో
తనకు సినిమా స్క్రిప్టు నచ్చితే ఎలాగైనా నటిస్తానని, ఇందుకోసం పరిమితులంటూ ఉండవని బాలీవుడ్ హీరోయిన్‌గా మారిన పోర్న్ స్టార్ సన్నీ లియోన్ వ్యాఖ్యానించారు. తాజాగా 'రాయీస్' చిత్రంలో 'లైలా మై లైలా.. ' పాటలో స్టెప్పులేసి అభిమానులతో ప్రశంసలను అందుకుంది. అయితే నటిగా తనలోని ప్రతిభను బయటపెట్టే క్రమంలో ఎలాంటి పరిమితులను పెట్టుకోనంటోందీభామ.
ఇదే అంశంపై సన్నీ మాట్లాడుతూ 'సినిమాల్లో నటించేందుకు ఎలాంటి పరిమితులు విధించుకోవాలని అనుకోవడం లేదు. అది స్క్రిప్టు మీద ఆధారపడి ఉంటుంది. స్క్రిప్టు బావుండి నా పాత్ర నచ్చితే.. దానికోసం ఎలాంటి పరిధులు పెట్టుకోను. ఆ పాత్రకు పూర్తిస్థాయి న్యాయం చేస్తా. బాలీవుడ్‌లో మంచి విషయమేంటంటే ఇక్కడ కావాల్సినన్ని స్క్రిప్టులు.. పని అందుబాటులో ఉంది.' అని చెప్పారు.
ఇటీవల బాలీవుడ్‌లో బయోపిక్‌ల పర్వం కొనసాగుతోంది. ఇదే విషయమై మాట్లాడిన సన్నీ.. ''ఒకవేళ నా జీవితాన్ని బయోపిక్‌గా నిర్మిస్తే అందులో విద్యాబాలన్ నటించాలని అనుకుంటున్నా. ఆమె అయితేనే నా పాత్రకు తగిన న్యాయం చేస్తుందని నా అభిప్రాయం'' అని మనసులోని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.