మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 28 డిశెంబరు 2016 (14:18 IST)

విజయ్ @61 సినిమాలో 14 ఏళ్ల తర్వాత హీరోయిన్‌గా జ్యోతిక..?

సూర్య సతీమణి, హీరోయిన్ జ్యోతిక పెళ్లికి తర్వాత సినిమాల్లో అంతగా కనిపించలేదు. పిల్లలు పుట్టిన తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జ్యోతిక లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది. కానీ ప్రస్తుతం ఓ స్టార్

సూర్య సతీమణి, హీరోయిన్ జ్యోతిక పెళ్లికి తర్వాత సినిమాల్లో అంతగా కనిపించలేదు. పిల్లలు పుట్టిన తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జ్యోతిక లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది. కానీ ప్రస్తుతం ఓ స్టార్ హీరోతో నటించే అవకాశాన్ని కైవసం చేసుకుంది. అది కూడా టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ సరసన విజయేంద్ర ప్రసాద్ కథతో రూపొందనున్న విజయ్ 61 వ సినిమాలో జ్యోతిక ఒక కథానాయికగా నటించనుందని సమాచారం. ఇందులో గ్లామర్ కోసం వేరే హీరోయిన్లు ఉంటారని, విజయ్ సరసన జ్యోతిక కూడా నటిస్తుందని తెలుస్తోంది. 
 
తద్వారా 14 ఏళ్ల తర్వాత విజయ్- జ్యోతికల కాంబినేషన్ రిపీటవుతోంది. అప్పట్లో వీళ్లిద్దరూ కలిసి ‘ఖుషీ’ సినిమాలో జంటగా నటించారు. అది తమిళంలో సూపర్ హిట్ కావడంతో పాటు తెలుగులో కూడా రీమేకైంది. మరి సెకండ్ ఇన్నింగ్స్‌లో హీరోయిన్‌గా నటించనున్న జ్యోతికకు మళ్లీ అవకాశాలు వెల్లువెత్తుతాయో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.