శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 సెప్టెంబరు 2022 (19:05 IST)

చిరంజీవి పేరుతో కాంగ్రెస్ ID కార్డు..

chiranjeevi
తాను రాజకీయాలకు దూరమైనా.. రాజకీయాలు తన నుంచి ఇంకా దూరం కాలేదంటూ చిరంజీవి ఇటీవల చేసిన ఓ ట్వీట్ పెద్ద సంచలనం సృష్టించింది. ఈ వ్యాఖ్యలను బట్టి జనసేన తరపున చిరంజీవి మళ్లీ రాజకీయాల్లో రీ-ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని పలువురు విశ్లేషించారు. 
 
ఇక వైసీపీ తరపున చిరంజీవికి రాజ్యసభ ఆఫర్ ఉందనే వాదనలు కూడా వినిపించాయి. కానీ తాజాగా చిరంజీవి పేరుతో పీసీసీ ఐడీకార్డు ఒకటి విడుదల కావడం ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేపింది. 
 
కోవూరు నుంచి పీసీసీ ప్రతినిధిగా చిరంజీవిని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఓ ఐడీకార్డును జారీ చేసింది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పరిశీలకుడిగా ఉన్న మధుసూదన్ మిస్త్రీ సంతకం కూడా దీని మీద ఉంది. త్వరలో జరగబోయే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా ఈ ఐడీ కార్డు జారీ చేసినట్టు తెలుస్తోంది.