శుక్రవారం, 1 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 సెప్టెంబరు 2022 (12:49 IST)

అమరావతిని మున్సిపాలిటీగా చేస్తారా? సర్కారు ఉద్దేశం ఏంటి? గ్రామస్తులు

amaravathi
అమరావతిని మున్సిపాలిటీగా చేయడం వెనుక వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి గల ఉద్దేశం ఏంటో చెప్పాలని గ్రామ సభల్లో అధికారులను ప్రజలు నిలదీశారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ అమరావతిని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసేందుకు అంగీకరించబోమని తెలిపారు. మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి గ్రామసభలు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. 
 
అమరావతి మున్సిపాలిటి ఏర్పాటు ప్రతిపాదనపై మంగళగరి మండలం, కృష్ణాయపాలెం, తుళ్లూరు మండలం మల్కాపురం, వెలగపూడి, పెదపెరిగి గ్రామాల్లో శుక్రవారం అధికారులు ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించారు. ఇందులో భాగంగా రాజధానిలో లేని గ్రామాలను మున్సిపాలిటీలోకి ఎందుకు తేవాలనుకుంటున్నారు.. అని ప్రశ్నించారు. 
 
మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ కొన్ని గ్రామాలను కలిపి రాజధాని గ్రామాలను ముక్కచెక్కలుగా చేసేందుకు ప్రభుత్వం అమరావతి మున్సిపాలిటీ ప్రతిపాదనను తెరమీదకు తెచ్చిందని మండిపడ్డారు. 
 
అమరావతిని రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అమరావతిని మున్సిపాలిటీగా చేసేందుకు అంగీకరించమని.. 12 అంశాలతో కూడిన అభ్యంతర పత్రాలను అధికారులకు ఈ సందర్భంగా గ్రామస్థులు అందజేశారు.