శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 సెప్టెంబరు 2022 (14:12 IST)

రైతులు సిక్కోలు గడ్డపై అడుగుపెడితే చితక్కొడతాం : మంత్రి అప్పల రాజు

minister appalaraju
రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు అమరావతి నుంచి అరసవల్లి వరకు మహా పాదయాత్రను చేపట్టారు. ఈ పాదయాత్రపై వైకాపా నేతలు ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారు. ఈ పాదయాత్రను సిక్కోలు గడ్డపై అగుడు పెట్టనివ్వబోమని రాష్ట్ర మత్స్య పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు హెచ్చరించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, విశాఖను పరిపాలనా రాజధాని చేయాలన్న డిమాండ్‌కు మద్దతుగా మంగళవారం రాత్రి శ్రీకాకుళం జిల్లా పలాసలో నానాపొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ జరిగింది. 
 
ఇందులో మంత్రి పాల్గొని ప్రసంగించారు. 
 
అమరావతి రాజధాని ల్యాండ్ పూలింగ్ కాదని, ఆదో స్కాం అని ఆరోపించారు. ఒక వర్గానికి మాత్రమే వినియోగపడే రాజధాని మనకు అవసరమా అంటూ ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజలు అక్కడ భవనాల్లో కూలి పనులు చేసుకోవడానికి ఉంటారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
 
 
'రాబోయే తరాలకు సంబంధించిన అంశమిది. మన ప్రాంతంలో రాజధాని నిర్మించుకోవాల్సిన అవసరం వచ్చింది. అమరావతి రాజధాని కావాలని ఎవరైనా నాముందు అడిగితే చొక్కాపటుకొని నిలదీస్తా, ఈ ప్రాంతంలో రాజకీయం చేస్తున్న వారు అమరావతి కావాలని కోరడాన్ని నిలదీయాలి' అని పిలునిచ్చారు.