శుక్రవారం, 1 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 సెప్టెంబరు 2022 (09:02 IST)

మూడు రాజధానులపై సీఎం జగన్ విఫల ప్రయోగం : సోమిరెడ్డి

somireddy
నవ్యాంధ్రకు మూడు రాజధానులను నిర్మిస్తామంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రయోగం విఫలమైందని ప్రజలకు బాగా అర్థమైందని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కానీ, ప్రజలను మభ్యపెట్టడానికి వైకాపా నేతలు దాన్నే పట్టుకుని వేలాడుతున్నారన్నారు. 
 
ఆయన నెల్లూరులో విలేకరులతో మాట్లాడుతూ, వైకాపా నేత విజయసాయి రెడ్డి బృందం ఉత్తరాంధ్రను తమ కబంధహస్తాల్లో పెట్టుకొని అక్కడి సంస్కృతిని నాశనం చేస్తుంటే, వారిని ఎదుర్కోవడం చేతగాక ధర్మాన వంటి దద్దమ్మ మంత్రులు శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న రైతులను అవాకులు చెవాకులు పేలడం సరికాదన్నారు. 
 
నిజం చెప్పాలంటే అనంతపురం నుంచి అమరావతికి రావాలంటే 10 నుంచి 12 గంటల సమయం పడుతుందన్నారు. కానీ, విజయవాడ నుంచి మరో ఆరు లేదా ఏడు గంటలు ప్రయాణిస్తేగానీ వైజాగ్ రాదని గుర్తుశారు. అమరావతి అనేది నవ్యాంధ్రకు నడిబొడ్డున ఉన్న రాజధాని అని దాన్ని వదిలిపెట్టి.. ఒక మూలన పెట్టాలని ఆనడంలో విజ్ఞత లేదన్నారు.