గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 సెప్టెంబరు 2022 (13:04 IST)

పొన్నియన్ సెల్వన్ నుంచి ట్రైలర్.. ఆద్యంతం ఎలా సాగిందంటే?

Ponnian selvan
Ponnian selvan
సెన్సేషనల్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం పొన్నియన్ సెల్వన్. కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్ యొక్క మొదటి రెండు నవలల ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ఇది. ఈ  సినిమా సెప్టెంబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా తమిళం- మలయాళం- కన్నడ- తెలుగు- హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. 
 
ఇందులో కరికాలన్‌గా విక్రమ్.. అరుణ్ మోళి వర్మన్‌గా జయం రవి.. వల్లవరాయన్ వాందివదేవన్‌గా కార్తి.. నందినిగా ఐశ్వర్యారాయ్.. కుందవై పిరిత్తియార్‌గా త్రిష నటిస్తున్నారు. 
 
వీళ్ళు కాకుండా విక్రమ్ ప్రభు, శోభితా ధూళిపాల, పార్తీబన్, శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.  చాలా కాలం తర్వాత మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ సినిమాకోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పై ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి.
 
తాజాగా ఈ సినిమానుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం యుద్దాలపైనే నడిచింది. ఈ ట్రైలర్ కు తమిళంలో కమల్ హాసన్.. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్.. తెలుగులో రానా దగ్గుబాటి .. కన్నడకు జయంత్ కైకిని .. హిందీకి అనిల్ కపూర్ వాయిస్ ఓవర్ లను అందించారు.