ఆదివారం, 5 ఫిబ్రవరి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated: సోమవారం, 19 సెప్టెంబరు 2022 (22:34 IST)

చీరకట్టులో ఫుట్‌బాల్ ఆడిన మహిళా ఎంపీ.. ఫోటోలు వైరల్

Mahua Moitra
Mahua Moitra
ఓ మహిళా ఎంపీ చీరకట్టులో ఫుట్‌బాల్ ఆడుతున్న ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ నుంచి మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ పార్టీకి చెందిన మహువా మొయిత్రా ఎంపీ. 
 
ఇటీవ‌ల ఫుట్‌బాల్ మ్యాచ్ ప్రారంభించిన కార్యక్రమానికి విచ్చేసిన ఆమె.. అనూహ్యంగా మైదానంలోకి దిగి చీర‌తో ఫుట్‌బాల్ ఆడారు. స్పోర్ట్స్ షూస్, సన్ గ్లాసెస్‌తో చీరతో పాటు, ఆమె ఫుట్‌బాల్ మైదానంలా మ్యాచ్ ఆడిన వైనం ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇచ్చింది. 
Mahua Moitra
Mahua Moitra
 
చీరలో ఆడినా కంపర్ట్ జోన్‌లో ఆమె బంతిని సునాయాసంగా పాస్ చేశారు. మహువా మొయిత్రా ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్‌లను నిర్వహించి క్రీడను ప్రోత్సహిస్తున్నారు. ఇంకా ఆమె ఫుట్‌బాల్ ప్లేయర్ కావడం విశేషం.