బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 సెప్టెంబరు 2022 (22:30 IST)

మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్: వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు

Work From Home
రాజస్థాన్ ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. మహిళా ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవవాశాన్ని కల్పించింది. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్థల్లో పని చేసే మహిళా ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే వెసులుబాటును కల్పించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా మహిళలకు వర్క్ ఫ్రం హోం అనుమతిస్తామని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ ప్రకటించారు.
 
జనాధార్ కార్డు ద్వారా మహిళలు ఈ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. ఈ పథకానికి రాజస్థాన్ ప్రభుత్వం రూ 100 కోట్ల కేటాయించింది. ఆరు నెలల్లో 20,000 మంది మహిళలకు ఉపాధి కల్పించాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. కాగా ఇప్పటివరకూ 150 మంది మహిళలు, 9 కంపెనీలు ఈ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయ్యాయని అధికారులు వెల్లడించారు.