సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 సెప్టెంబరు 2022 (09:23 IST)

విజయవంతంగా సాగుతున్న రాహుల్ గాంధీ పాదయాత్ర - 38 కిమీ పూర్తి

rahul jodo yatra
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా సాగుతోంది. ఈ యాత్రలో భాగంగా ఇప్పటివరకు మూడు రోజుల యాత్ర ముగిసింది. ఆయన మొత్తం 38 కిలోమీటర్ల మేరకు నడిచారు. కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు చేపట్టిన ఈ యాత్రను తమిళనాడు రాష్ట్రంలో ప్రారంభించారు. 
 
వచ్చే 2024 ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సమాయాత్తం చేసేందుకు వీలుగా ఆయన ఈ యాత్రను ప్రారంభించారు. శుక్రవారంతో మూడో రోజు ముగిసింది. మూడో రోజు యాత్ర శుక్రవారంతో ముగిసిందని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. 
 
ఈ ప్రకటన ప్రకారం మూడో రోజు పాదయాత్ర ముగిసే సరికే రాహుల్ గాంధీ 38 కిలోమీటర్ల నడకను పూర్తి చేశారు. ఈ యాత్ర ఇంకా కన్యాకుమారి పరిసర ప్రాంతాల్లోనే ఉంది. మొత్తం 152 రోజు పాటు సాగనుంది. ఇందులో రాహుల్ గాంధీ ఏకంగా 3570 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేయనున్నారు.