శుక్రవారం, 4 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 సెప్టెంబరు 2022 (12:04 IST)

ఆశ భయాన్ని ఓడిస్తుంది.. నాడు తండ్రిని కోల్పోయా... నేడు.. : రాహుల్

Rahul Gandhi
Rahul Gandhi
ఆశ భయాన్ని ఓడిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. నాడు నా తండ్రిని కోల్పోయాను. నేడు నా దేశాన్ని కోల్పోయేందుకు సిద్ధంగా లేను అంటూ రాహుల్ గాంధీ అన్నారు. 
 
బుధవారం ఉదయం తమిళనాడులోని కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్‌లో ఉన్న రాజీవ్‌ గాంధీ స్మారకాన్ని రాహుల్ సందర్శించారు. తొలుత ఈ స్మారకం ప్రాంగణంలో మొక్కను నాటిన రాహుల్‌.. అనంతరం రాజీవ్‌ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించిన తర్వాత ప్రార్థనా సమావేశంలో పాల్గొన్నారు. 
 
రాజకీయ ప్రవేశం తర్వాత రాహుల్ తన తండ్రి స్మారకాన్ని సందర్శించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ ఫొటోను రాహుల్‌ తన ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ.. 'విద్వేష, విభజన రాజకీయాల కారణంగా నేను నా తండ్రిని కోల్పోయాను. ఇప్పుడు నా దేశాన్ని కూడా కోల్పోవాలనుకోవడం లేదు. ప్రేమ ద్వేషాన్ని జయిస్తుంది. ఆశ భయాన్ని ఓడిస్తుంది. మనమంతా ఐక్యంగా ఉంటే దేన్నైనా అధిగమించొచ్చు' అని రాహుల్ రాసుకొచ్చారు.