శుక్రవారం, 14 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 సెప్టెంబరు 2022 (16:58 IST)

కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా ఈ నలుగురిలో మీ ఓటు ఎవరికి.. పోల్ పెట్టిన సోనియా

sonia gandhi
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్నిక త్వరలో జరుగనుంది. ఇందుకోసం ఆ పార్టీలో ముమ్మర కసరత్తు జరుగుతోంది. ఇందులోభాగంగా, ఆ పార్టీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ నలుగురు పేర్లను ఎంపిక చేసిన పోల్ నిర్వహిస్తారు. ఈ నలుగురిలో తన కుమార్తె ప్రియాంకా గాంధీ, పార్టీ సీనియర్ నేతలు అశోక్ గెహ్లాట్ (మధ్యప్రదేశ్ సీఎం), శశిథరూర్, సచిన్ పైలెట్‌లు ఉన్నారు. 
 
స్వయంగా సోనియా గాంధీ ప్రతిపాదించిన ఈ జాబితాలో రాహుల్ గాంధీ పేరు కనిపించకపోవడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడుగా ఈ నలుగురిలో ఎవరికి మీ ఓటు అని సోనియా గాంధీ పోల్ పెట్టారు. ఈ నలుగురిలో పార్టీ అధ్యక్షులుగా ఎవరైతే బాగుంటుందో చెప్పాలంటూ ఆమె పోస్ట్ చేశారు. 
 
కాగా, గత 2019 ఎన్నికలకు ముందు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉన్నారు. ఆ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. అప్పటి నుంచి సోనియా తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఆ తర్వాత తిరిగి ఆ పదవిని చేపట్టేందుకు ఆయన మొండికేశారు. దీంతో సోనియా కొత్తగా నలుగురు పేర్లను ప్రతిపాదించారు. ఇందులో రాహుల్ లేకపోవడం గమనార్హం.