శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (14:16 IST)

అమిత్ షా మఫ్లర్ ధర రూ.80 వేలు.. రాహుల్ టీ షర్టుపై రాజకీయాలా?

ashok gehlot
కాంగ్రెస్ అగ్రనేత రాహల్ గాంధీ భారత్ జోడో యాత్రను చేపట్టారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఇపుడు కేరళ రాష్ట్రంలో విజయవంతంగా సాగుతోంది. అయితే, ఈ యాత్రా సమయంలో రాహుల్ గాంధీ ధరించిన ఓ టి షర్టు ధర రూ.45 వేలు అంటూ బీజేపీ శ్రేణులు ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది వైరల్ అయింది. బీజేపీ నేతలకు కాంగ్రెస్ నేతలు ధీటుగానే కౌంటరిచ్చారు. రాహుల్ ధరించిన టీ షర్టు ధర రూ.45 అయితే, ప్రధాని మోడీ ధరించే కళ్లద్దాల ధర రూ.85 వేలు, ఆయన ధరించే కోటు ధర రూ.10 లక్షలు అంటూ కౌంటరిచ్చారు. దీంతో బీజేపీ శ్రేణులు తోకముడిచాయి. 
 
తాజాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందించారు. టీ షర్టుల పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తుందని అన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా ధరించే మఫ్లర్ ధర రూ.80 వేలకు పైనే ఉంటుందని చెప్పారు. బీజేపీ నేతలు ధరించే సన్ గ్లాసెస్ ధర రూ.2.50 లక్షలకు పైగానే ఉంటుందని అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రలో బీజేపీ నేతలకు వచ్చిన ఇబ్బంది ఏమిటని నిలదీశారు. 
 
"బీజేపీ నేతలకు రూ.2.50 లక్షల సన్ గ్లాసెస్‌, రూ.80 వేల మఫ్లర్లు ధరిస్తూ రాహుల్ గాంధీ టీ షర్ట్ గురించి మాట్లాడుతున్నారు. కేంద్ర హో మంత్రి అమిత్ షా ధరించే మఫ్లర్ ధర రూ.80 వేలకుపైనే ఉంటుంది. అయినా టీ షర్టులపై బీజేపీ రాజకీయాలు చేస్తుంది" గెహ్లాట్ కౌంటరించారు.