శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 8 సెప్టెంబరు 2022 (14:39 IST)

అమిత్ షా భద్రతలో లోపం... ఆంధ్రప్రదేశ్ ఎంపీ పీఏగా నటించిన వ్యక్తి అరెస్ట్

Amit Shah
ఆంధ్రప్రదేశ్ ఎంపీ పీఏగా నటించిన ఒక వ్యక్తిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముంబయి పర్యటనలో భాగంగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

 
ఏక్‌నాథ్ శిందే ముఖ్యమంత్రి అయిన తరువాత అమిత్ షా తొలిసారి మహారాష్ట్ర వచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎంపీ పర్సనల్ అసిస్టెంట్‌గా నటించిన హేమంత్ పవార్ అనే వ్యక్తి ఆయన బస చేసిన నివాసంలోకి వచ్చారని పోలీసులు తెలిపారు.

 
అలాగే కేంద్ర హోంశాఖకు చెందిన వ్యక్తిగా నటించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ నివాసాల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. హేమంత్ పవార్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.