ఐశ్వర్య మీనన్‌ను టాలీవుడ్ ప్రేక్షకులు ఆదరించేనా?
ఐశ్వర్య మీనన్ మలయాళ భామ. 2012లో ఓ తమిళ చిత్రంతో తన సినీ కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత మాలీవుడ్, శాండల్‌వుడ్, కోలీవుడ్‌లలో తనకంటూ గుర్తింపు సొంతం చేసుకుంది. నటన పరంగా, గ్లామర్ పరంగా ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత చాలా తక్కువ గ్యాప్‌లోనే మలయాళం, కన్నడ చిత్ర సీమల్లో మెరిసింది. ఇపుడు తెలుగులో రెండో చిత్రంలో నటిస్తున్నారు.
ఐశ్వర్య మీనన్.. "స్పై" చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టింది. నిఖిల్ హీరోగా చేసిన ఈ చిత్రంలో ఆయన జోడీగా కనిపిచించారు. అయితే, ఈ సినిమా పరాజయంపాలుకావడంతో ఆమె గురించి ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు. ఇపుడు కొంత విరామం తర్వాత మళ్లీ కార్తికేయతో జోడీకట్టింది.
కార్తికేయ హీరోగా "భజే వాయు వేగం" అనే చిత్రంలో ఆమె నటించారు. ఈ నెల 31వ తేదీన ఈ చిత్రం విడుదలకానుంది. యూవీ కాన్సెప్ట్ పతాకంపై నిర్మించారు. ఈ సినిమా హిట్ అయితే ఇక్కడ నిలదొక్కుకోవచ్చని ఈ ముద్దుగుమ్మ ఎన్నో ఆశలతో ఉంది. మరి ఆమె ముచ్చటను ఈ సినిమా ఎంతవరకు నెరవేర్చుతుందో వేచి చూడాల్సిందే.