బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 8 మే 2024 (16:53 IST)

హీరో కార్తికేయ గుమ్మకొండ భజే వాయు వేగం రిలీజ్ ఖరారు

Karthikeya Gummakonda
Karthikeya Gummakonda
హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న "భజే వాయు వేగం" సినిమా రిలీజ్ డేట్ ను ఈరోజు అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ నెల 31న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషించారు. "భజే వాయు వేగం" సినిమాకు ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.
 
ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా "భజే వాయు వేగం" సినిమా రూపొందింది. టీజర్, లిరికల్ సాంగ్ తో ఇప్పటికే ఆడియెన్స్ లో "భజే వాయు వేగం" సినిమా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. బిగ్ స్క్రీన్స్ మీద ఈ సినిమాను చూడాలనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో ఏర్పడుతోంది. రేపు ఉదయం 9.09 నిమిషాలకు "భజే వాయు వేగం" సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'సెట్ అయ్యిందే'ను రిలీజ్ చేస్తున్నారు.
నటీనటులు - కార్తికేయ గుమ్మకొండ, ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ తదితరులు