మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (16:57 IST)

కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న భజే వాయు వేగం విడుదలకు సిద్ధం

Karthikeya Gummakonda
Karthikeya Gummakonda
యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మీద హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న సినిమా "భజే వాయు వేగం". ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాకు ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. 
 
ఇవాళ "భజే వాయు వేగం" సినిమా టీజర్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. ఈ సినిమా టీజర్ ను రేపు మధ్యాహ్నం 2.25 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో టీజర్ కూడా బాగుంటుందనే ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి. "భజే వాయు వేగం" సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. థియేట్రికల్ రిలీజ్ డేట్ ను త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు.