వాట్సప్‌లో అసభ్యకర ఫోటోలు: అజాజ్ ఖాన్‌పై ముంబైలో కేసు.. ఐశ్వర్య అనే మోడల్..?!
వాట్సప్‌లో అసభ్యకర ఫోటోలు పంపాడన్న ఆరోపణలపై ప్రముఖ బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్‌పై ముంబయిలో కేసు నమోదైంది. తనకు ఏజాజ్ ఖాన్ అసభ్యకర ఫోటోలు పంపుతున్నాడంటూ ఐశ్వర్య చౌబే అనే మోడల్ ముంబయి వర్సోవా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సమన్లు జారీ చేశారు.
ఏజాజ్ ఖాన్ తనకు పంపిన ఫోటోని తాను డిలీట్ చేశానని ఐశ్వర్య చౌబే పోలీసుల ముందు చెప్పింది. నటుడిపై తాను చేసిన ఫిర్యాదు...పబ్లిసిటీ కోసం కాదని ఆమె పోలీసులకి తెలిపింది. కాగా, అజాజ్ ఖాన్ తెలుగులో 'దూకుడు' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి అజాజ్ ఖాన్ పరారీలో ఉన్నాడు. పరారీలో ఉన్న అతడి కోసం పోలీసు గాలింపు చర్యలు చేపట్టారు.