గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 మార్చి 2021 (17:06 IST)

ఆటోలో ప్రయాణించిన అజిత్... మాస్క్ ధరించి..? (video)

తమిళనాడు స్టార్ హీరో అజిత్ ఆటోలో ప్రయాణించారు. బ్లాక్‌ కలర్‌ టీషర్టు, మాస్క్‌ ధరించి.. చాలా సాధారణ వ్యక్తిలా ఆటోలో ప్రయాణించారు. లగ్జరీ కార్లు ఉన్నప్పటికీ...స్టార్‌ హీరో అయినప్పటికీ.. సాధారణ వ్యక్తిలా ప్రయాణించడం ఆయన అభిమానులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. అజిత్‌ ఫ్యాన్స్‌ అసోసియషన్‌ అధ్యక్షులు కన్నదాసన్‌ బాలముర్‌గన్‌ మాట్లాడుతూ.. "అజిత్‌ సర్‌ వీధుల్లో నడుస్తారు.. ఆటోలో ప్రయాణిస్తారు. ఇటువంటి వాటివల్లే.. ఆయన సామాన్య జనం గుండెల్లో నిలిచిపోతారు" అని అన్నారు.
 
ఇలా అజిత్‌ ఆటోలో ప్రయాణించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ అయిన కొద్దిసేపటికే వైరల్‌ అయ్యాయి. ప్రస్తుతం అజిత్‌ వలిమై చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర చివరి షెడ్యూల్‌ విదేశాల్లో జరగనుంది. వినోద్ తెరకెక్కించగా, బోనీకపూర్‌ నిర్మిస్తున్నారు. సంగీతాన్ని యువన్‌ శంకర్‌ రాజా అందిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ మే 1వ తేదీన విడుదల కానుంది. ఇందులో అజిత్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు 15న విడుదల కానుంది.