గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 9 డిశెంబరు 2023 (16:50 IST)

సందీప్ కిషన్ మాయావన్‌లో హీరోయిన్ గా ఆకాంక్ష రంజన్ కపూర్

Akanksha Ranjan Kapoor, Sandeep Kishan
Akanksha Ranjan Kapoor, Sandeep Kishan
హీరో సందీప్ కిషన్, క్రియేటివ్ డైరెక్టర్ విఐ ఆనంద్‌ దర్శకత్వంలో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో చేస్తున్న మోస్ట్ అవైటెడ్‘ఊరు పేరు భైరవకోన’తో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఇప్పుడు ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రొడక్షన్ నెం. 26 కోసం మళ్లీ ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో జతకట్టారు.
 
ప్రాజెక్ట్‌జెడ్/మాయవన్ సంచలన విజయం తర్వాత సందీప్ కిషన్‌తో సివి కుమార్ ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రాజెక్ట్‌జెడ్/మాయవన్ వరల్డ్‌లో సెట్ చేయబడిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ దీనికి సీక్వెల్. ఈ చిత్రానికి మాయావన్ అని టైటిల్ పెట్టారు. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో రాంబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిషోర్ గరికిపాటి (జికె) ఎగ్జిక్యూటివ్ నిర్మాత.
 
ధర్మ ప్రొడక్షన్స్ మొదటి ఓటీటీ చిత్రం ‘గిల్టీ’తో తన నటనను ప్రారంభించి, ఆ తర్వాత విమర్శకుల ప్రశంసలు పొందిన ఆంథాలజీ సిరీస్ రే,  స్ట్రీమింగ్ సిరీస్ మోనికా ఓ మై డార్లింగ్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఆకాంక్ష రంజన్ కపూర్.. ఈ చిత్రంలో సందీప్ కిషన్ కు జోడిగా నటిస్తున్నారు. పైన పేర్కొన్న ఓటీటీ కంటెంట్‌తో ఇప్పటికే తన నటనా నైపుణ్యాన్ని నిరూపించుకున్న ఆకాంక్ష రంజన్ కపూర్ మాయావన్ తో వెండితెర ఎంట్రీ ఇస్తున్నారు.
 
టాప్-క్లాస్ ప్రొడక్షన్, టెక్నికల్ స్టాండర్డ్స్‌తో హై బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రం, సూపర్‌విలన్‌తో ఒక సామాన్యుడి ఘర్షణ కథగా వుండబోతుంది .
ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. కార్తీక్ కె తిల్లై సినిమాటోగ్రఫీ అందిస్తుండగా,  నాని దసరాకి చార్ట్‌బస్టర్ ఆల్బమ్ అందించి, ప్రభాస్ పాన్ వరల్డ్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’ కోసం పనిచేస్తున్న సెన్సేషనల్ కంపోజర్ సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
 
సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.