శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 1 మార్చి 2020 (15:04 IST)

పరాస్‌తో బ్రేకప్.. మికాసింగ్‌తో రిలేషన్‌‌.. ఆకాంక్ష పూరీ

Akash puri
బాలీవుడ్‌లో తెరకెక్కిన ''క్యాలెండర్ గర్ల్స్'' అనే సినిమాలో నటించిన ఆకాంక్ష పూరీ పరాస్ చంబ్రా అనే నటుడితో కొంతకాలం క్రితం ప్రేమలో పడింది. అయితే ఇటీవల సల్మాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఓ రియాల్టీ షోలో పాల్గొన్న పరాస్‌.. షోలో భాగంగా బుల్లితెర నటి మహీరా శర్మతో చాలా క్లోజ్‌గా ఉన్నాడు. దీంతో ఆకాంక్ష పూరీ అతడికి బ్రేకప్‌ చెప్పేసింది. 
 
ఈ క్రమంలో ఆకాంక్ష.. పరాస్‌తో ప్రేమలో ఉన్నప్పుడు తన మణికట్టుపై అతని పేరుతో వేయించుకున్న టాటూను తాజాగా తీయించేసింది. పరాస్‌ పేరు స్థానంలో ఓ బార్‌కోడ్‌ లాంటి దాన్ని వేయించుకుని.. 'బిఈంగ్‌ మీ' అని టాటూగా రాయించుకున్నారు. 
 
టాటూ తొలగింపునకు సంబంధించిన ఫొటోలను సైతం ఆమె ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అనంతరం ఆమె ప్రముఖ గాయకుడు మికా సింగ్‌తో దిగిన పలు ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. మికాసింగ్‌తో తన సంబంధాన్ని ధ్రువీకరించింది.