శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (13:18 IST)

#RomanticonMay29th లిప్ లాక్ పోస్టర్ వైరల్..

Romantic
ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న తాజా సినిమా రొమాంటిక్... మేలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో రొమాంటిక్ సినిమాను మే 29న ప్రపంచవ్యాప్తంగా ''రొమాంటిక్''ను థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు డాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ అధికారికంగా ప్రకటించారు.
 
వేసవి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా మంచి వినోదాన్ని పంచుతుందని పూరీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా తాజాగా హీరోయిన్ కేతికా శర్మతో హీరో ఆకాష్ లిప్ లాక్ చేస్తున్న రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
 
ఇకపోతే.. రమ్యకృష్ణ ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని అనిల్ పాడూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంటెన్స్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం సమకూరుస్తున్నారు. 
 
నరేష్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఆకాష్ పూరి, కేతికా శర్మ, రమ్యకృష్ణ, మకరంద్ దేశ్ పాండే, ఉత్తేజ్, సునయన తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: పూరి జగన్నాథ్ డైరెక్టర్: అనిల్ పాడూరి, నిర్మాతలు: పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, సమర్పణ: లావణ్య, ఎడిటింగ్: జునైద్ సిద్దిఖి.