సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 జనవరి 2020 (11:10 IST)

#NaaVallaKadhe- రొమాంటిక్ నుంచి బ్రేకప్ సాంగ్.. వీడియో

ఆకాష్ పూరీ, కేతికా శర్మ జంటగా నటిస్తున్న రొమాంటిక్ సినిమా నుంచి నా వల్ల కాదే అంటూ సాగే పాట రిలీజైంది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్‌లకు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో.. తాజాగా ఈ సినిమా నుంచి బ్రేకప్ సాంగ్ విడుదలైంది. భాస్కరపట్ల లిరిక్స్ అందించిన ఈ పాటకు సునీల్ కశ్యప్ సంగీతం సమకూర్చారు. 
 
అనిల్ పడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలను ఆకాష్ తండ్రి అదేనండి.. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ అందిస్తున్నారు. ''రొమాంటిక్'' సినిమా న్యూ-ఏజ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతుందని సినీ యూనిట్ వెల్లడించింది. ఇప్పటికే టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకేముంది.. నా వల్ల కాదే సాంగ్‌ను ఓ లుక్కేయండి.