మంగళవారం, 28 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (14:52 IST)

పెళ్లి వార్త పెద్ద వార్త.. నాగ్ స్పందిస్తారా...? అఖిల్-శ్రియా ఎందుకిలా?

పెళ్లంటే నూరేళ్ల పంట. జంటకు నిశ్చితార్థం జరిగిన తర్వాత పెద్దలు చెప్పిన ప్రకారం సగం పెళ్లయిపోయినట్లే. అలాంటిది సగం పెళ్లి ముగిశాక అఖిల్-శ్రియలపై ఇలాంటి వార్తలు రావడం బాధాకరం. ఈ వార్తలపై అక్కినేని నాగార్జున స్పందిస్తే బావుంటుందేమోనన్న అభిప్రాయాలు వ్యక్

పెళ్లంటే నూరేళ్ల పంట. జంటకు నిశ్చితార్థం జరిగిన తర్వాత పెద్దలు చెప్పిన ప్రకారం సగం పెళ్లయిపోయినట్లే. అలాంటిది సగం పెళ్లి ముగిశాక అఖిల్-శ్రియలపై ఇలాంటి వార్తలు రావడం బాధాకరం. ఈ వార్తలపై అక్కినేని నాగార్జున స్పందిస్తే బావుంటుందేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
సినిమా ఇండస్ట్రీలో గాసిప్స్ మామూలే. జస్ట్ షూటింగులో హీరోహీరోయిన్లు కలిసి ఎక్కువసేపు తిరిగినా, రాత్రిపూట అలా పార్టీలకు వెళ్లినా దాన్ని కొండంతలు చేసి రాస్తుంటారు. ఐతే అఖిల్-శ్రియల పెళ్లిపై మీడియాలో వ్యతిరేక వార్తలు హల్ చల్ చేయడం ఒకింత బాధించే అంశమే. ఈ వార్తలో నిజానిజాలేమిటో అక్కినేని ఫ్యామిలీ వెల్లడిస్తే బావుంటుందేమో..? అసలీ వార్తలు వారి దాకా వెళ్లాయో లేదో మరి.
 
ఇకపోతే అఖిల్-శ్రియల మధ్య ఏవో గొడవలు చెలరేగాయనీ, అందువల్ల ఇద్దరి మధ్య తేడా వచ్చిందని ఓ వార్త. అదేంకాదు... రెండు ఫ్యామిలీల మధ్య మనస్పర్థలు వచ్చాయని ఇంకో వార్త. ఇలా ఎవరిష్టం వచ్చినట్లు వారు వండి వార్చేస్తున్నారు.