పాన్ ఇండియా స్టార్‌గా అక్షయ్ తర్వాత ప్రభాస్
బిఫోర్ బాహుబలి ఆఫ్టర్ బాహుబలి అంటూ ప్రభాస్ కెరీర్ వుంటుందని అప్పట్లోనే దర్శకుడు రాజమౌళి జోస్యం చెప్పారు. ఆయన అన్న మాటలు నిజమవుతున్నాయి. ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ యు.వి. క్రియేషన్‌పై చేశాడు. అది ఆయన స్వంత నిర్మాణ సంస్థ. అందుకే దానికి ఆయన పారితోషికం ఎంతనేది పెద్దగా చర్చకు తావీయలేదు. ఇప్పుడు ప్రభాస్ సలార్, ఆదిపురుష్‌తోపాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమాలు చేయబోతున్నాడు. ఇప్పటికే సలార్, ఆదిపురుష్ సినిమాలు షూటింగ్ కొంత భాగం జరిగాయి. నాగ్ అశ్విన్ సినిమా ఇంకా సెట్‌పైకి వెళ్ళలేదు.
అయితే ప్రస్తుతం చేస్తున్న మూడు సినిమాలకుగాను ఒక్కో సినిమాకు ప్రభాస్ వందకోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు, తమిళ భాషల్లో ఇంతవరకు ఆ స్థాయికి చేరిన హీరోనే లేడు. ప్రభాస్‌కు ధీటుగా బాలీవుడ్ అక్షయ్ కుమార్ ఒక్కరే వున్నారు. అక్షయ్‌కుమార్ ప్రస్తుతం బెల్‌బాటమ్, సూర్యవంశీ, పృధ్వీరాజ్ సినిమాలు చేస్తున్నాడు. బెల్‌బాటమ్ విడుదలకు సిద్ధమైంది. ఇవి పూర్తయిన తర్వాత పాన్ ఇండియా మూవీ రామసేతు త్వరలో చేయనున్నాడు. ఆ సినిమాకు సంబంధం గ్రౌండ్ వర్క్ మొత్తం పూర్తయింది. అయితే అక్షయ్ కుమార్ ఒక్కో సినిమాకు 117 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు బాలీవుడ్ ట్రేడ్‌వర్గాలు ఇటీవలే వెల్లడించాయి. సో. పాన్ ఇండియా మూవీస్‌లో అక్షయ్ కుమార్ తర్వాత స్థానం ప్రభాస్‌దే అన్నమాట.