శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 ఏప్రియల్ 2023 (10:08 IST)

రెండు ఫ్లాట్స్ సిస్టర్‌కు గిఫ్టుగా ఇచ్చింది.. రూ.37 కోట్లతో కొత్త ఇల్లు కొంది..?

బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియా భట్ బాంద్రాలోని పాలీ హిల్ ప్రాంతంలో రూ.37.80 కోట్లతో కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. ఇది 2,497 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంది. ఈ ఇల్లు కపూర్ బంగ్లాకు దగ్గరగా ఉంది. ఈ ఇంటికి సంబంధించి ఈ నెల 10న అగ్రిమెంట్ జరిగింది. కొనుగోలుకు సంబంధించి, ఆమె తన రెండు ఫ్లాట్లను తన సోదరి షాహీన్‌కి బహుమతిగా ఇచ్చింది. వీటి విలువ రూ. 7.68 కోట్లు. వీటిలో ఒక ఫ్లాట్ విస్తీర్ణం 1,197 చదరపు అడుగులు కాగా, మరో ఫ్లాట్ విస్తీర్ణం 889.75 చదరపు అడుగులు.
 
గతేడాది ఏప్రిల్ 14న అలియా భట్, రణబీర్ కపూర్ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కూతురు పుట్టడంతో ఆమెకు రాహా కపూర్ అని పేరు పెట్టారు. తల్లిగా తన బాధ్యతలను నిర్వహిస్తున్న అలియా భట్, ఇటీవలే తన పెట్టుబడులను  మరింత పెరిగింది. ఆమె బాంద్రాలోని ఖరీదైన పాలి హిల్ ప్రాంతంలో ఒక అపార్ట్‌మెంట్‌ని కొనుగోలు చేసింది. 
 
ఇంకా అలియా భట్ తన సోదరి షాహీన్ భట్‌కి ప్రైజ్ సర్టిఫికేట్ ద్వారా రెండు ఇళ్లను బహుమతిగా ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. రూ. 7.68 కోట్ల విలువైన ఈ అపార్ట్‌మెంట్లు ముంబైలోని ఎబి నాయర్ రోడ్ జుహులోని జిగి అపార్ట్‌మెంట్‌లో ఉన్నాయి. మొదటి ఇల్లు 1,197 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 2వ ఫ్లాట్ 889.75 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నట్లు సమాచారం.