ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (12:49 IST)

రూ.4.10 కోట్ల విలువైన 436 యాపిల్ ఐఫోన్లు చోరీ.. కన్నం వేసి... ఎక్కడ?

Apple
Apple
అమెరికాలోని ఓ యాపిల్ స్టోర్ నుంచి రూ.4.10 కోట్ల విలువైన ఐఫోన్లు చోరీకి గురయ్యాయన్న వార్త తీవ్ర కలకలం రేపింది. అమెరికాలో సీఐఏ అనే ​​ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాలుగా Apple స్టోర్ పనిచేస్తోంది. ఈ దుకాణం గోడకు కన్నం వేసి రూ.4.10 కోట్ల విలువైన 436 ఐఫోన్లను దుండగులు అపహరించినట్లు సమాచారం. 
 
ఈ విషయాన్ని స్టోర్ సీఈవో తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. ఇద్దరు వ్యక్తులు ఈ పని చేశారని, కమర్షియల్‌ భవనం బ్లూప్రింట్‌లు దొంగల వద్ద ఉన్నాయని తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
సాధారణంగా నగలు, డబ్బు, బ్యాంకుల్లో దోపిడీలు జరుగుతుంటాయి.. అయితే తొలిసారిగా యాపిల్ స్టోర్‌లో దొంగలు చేతివాటం చూపించడం అమెరికాలో సంచలనం రేపుతోంది.