గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 జనవరి 2021 (11:33 IST)

ఒక సారి నాకు పెళ్లి కుదిరింది.. ఆమే విలన్.. మహానటి అందుకే చనిపోయింది?.. షకీలా (video)

Shakeela
ఆలీ వ్యాఖ్యాతగా 'ఈటీవీ'లో ప్రసారమవుతున్న 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి తాజాగా షకీలా, అనురాధ విచ్చేసి తమ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.పెళ్లి సంబంధం కుదిరి.. డేట్‌ కూడా ఓకే అనుకున్నాక.. కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయిందని నటి షకీలా వెల్లడించింది.

అనంతరం లాక్‌డౌన్‌ సమయంలో టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ డైరెక్టర్‌ తనకి ఫోన్‌ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారని.. ఆయన మాటలు వినగానే కన్నీళ్లు ఆగలేదని.. షకీలా భావోద్వేగానికి లోనయ్యారు. 
 
ఆటోబయోగ్రఫీ అంటే అందులో అన్నీ నిజాలే చెప్పాలని.. అందుకే లైఫ్‌లో ఎదుర్కొన్న అన్నిరకాల కష్టసుఖాలను తన స్వీయ జీవితచరిత్రలో వెల్లడించానని షకీలా తెలిపారు. తన వివాహం గురించి మాట్లాడుతూ.. 'ఒక సారి నాకు పెళ్లి కుదిరింది. వివాహ తేదీని కూడా ఫిక్స్‌ చేశారు. అమ్మ చనిపోయిన తర్వాత అన్ని ఆ వ్యక్తే అనుకున్నాను. 
 
అయితే రోకా సమయంలో ఆ వ్యక్తి (పెళ్లికొడుకు) మద్యం తాగి వచ్చి గొడవ చేశాడు. ఆ సమయంలో మా ఇద్దరికీ వాగ్వాదం చోటుచేసుకుంది. అతన్ని పెళ్లి చేసుకోనని చెప్పేశాను. అలా నా పెళ్లి క్యాన్సిల్‌ అయ్యింది. కాకపోతే ఆ కుటుంబంలోని వారందరూ ఇప్పటికీ నాతో మాట్లాడుతూనే ఉంటారు' అని షకీలా నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు.
 
ఇక మహానటి సావిత్రి గురించి మాట్లాడుతూ.. ‘జెమినీ గణేషన్ మొదటి భార్య కూతురు ఒక ప్రశ్న అడిగింది.. సావిత్రి గారు చాలా మంచిది.. ఎవరు ఏమి అడిగినా తీసి ఇచ్చేస్తుంది.. పుణ్యం మాత్రమే చేసుకుంది. అయితే ఎందుకు అలా చచ్చింది?’ అని అడిగింది. ఆ పాయింట్ నాకు ఇప్పుడు బాగా గుచ్చుకుంది. చివరికి హాస్పిటల్‌కు కూడా వెళ్లే పరిస్థితి లేక గవర్నమెంట్ హాస్పిటల్‌లో చనిపోయింది. అంటే ధర్మం చేయొద్దని అంటారా?? ’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది షకీలా.
 
ఇక తన కన్నతల్లి గురించి చెప్తూ.. తన కన్నతల్లే తన లైఫ్‌లో విలన్ అని.. ఎంగ్ ఏజ్‌లో తనని హోటల్ గదికి వెళ్లమందని.. ఏ ఏజ్‌లో తన కన్యత్వం పోయిందో తన ఆటోబయోగ్రఫీలో రాసిన విషయాలను బోల్డ్‌గా చెప్పింది షకీలా. ఆటో బయోగ్రఫీ అంటే అన్నీ అబద్ధాలు చెప్పడం కాదు కదా.. నిజాలు చెప్తేనే నాలా తప్పులు చేయరు’ అంటూ నిక్కచ్చిగా మాట్లాడింది షకీలా.