సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 డిశెంబరు 2020 (18:10 IST)

నాకు ఆరుగురు భర్తలుండేవారు.. గుమ్మడి గారూ సొంత పెళ్లాంలా..?: అన్నపూర్ణ

Annapurna
అలీతో సరదాగా కార్యక్రమంలో సీనియర్ నటి అన్నపూర్ణ పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ కార్యక్రమంలో భాగంగా అన్నపూర్ణ తనకు ఆరుగురు భర్తలని చెప్పి టక్కున నవ్వేశారు. మొదట్లో హీరోయిన్‌గా నటించాలంటే కొన్ని ఇబ్బందులు వచ్చాయని.. కొందరు నాకేంటి అని అడిగే వాళ్లని అందుకే హీరోయిన్ వేషాలు మానేసి చిన్న వయసులోనే అమ్మగా సెటిల్ అయిపోయానని అన్నపూర్ణ చెప్పారు. ఆ తర్వాత తనకు ఆరుగురు భర్తలున్నారని నవ్వుతూ చెప్పారు.  
 
ఆ రోజుల్లో తనకు ఆరుగురు సినిమా భర్తలు ఉండేవాళ్లని.. అందులో ఎక్కువగా గుమ్మడి గారితో నటించేదాన్ని అంటూ తెలిపారు అన్నపూర్ణ. ఈ మాట వినగానే పక్కనే ఉన్న వై విజయతో పాటు అలీ కూడా పక్కున నవ్వేశాడు. ఆ రోజుల్లో అలా ఎక్కువ సినిమాల్లో నటించడం వల్లో ఏమో కానీ గుమ్మడి గారూ తల పట్టుకుంటూ.. ఏంటో ఇది అంటూ తనను నిజంగానే సొంత పెళ్లాంలా ఫీల్ అయ్యేవారంటూ నవ్వేశారు అన్నపూర్ణ. 
 
ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలోనే అన్నపూర్ణ చాలా విషయాలు చెప్పార. మరి కార్యక్రమంలో ఇంకెన్ని నిజాలు బయటపడతాయోనని అభిమానులు అంటున్నారు.