శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 జులై 2020 (21:47 IST)

సుధీర్ నిజంగా మంచివాడా..? లేక నటిస్తున్నాడా..? రష్మీ గౌతమ్

జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరపై ఓ వెలుగు వెలుగుతున్న జోడీ యాంకర్ రష్మీ, సుధీర్. వీరిద్దరూ త్వరలో వెండితెరపై మెరవనున్నట్లు ఇప్పటికే టాక్ వస్తోంది. బుల్లితెరపై మంచి క్రేజున్న జోడీగా ముద్రవేసుకున్న ఈ జంట కోసం స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఇప్పటికే దర్శకులు వున్నారట. అలాంటి పరిస్థితుల్లో.. 'అలీతో సరదాగా' అనే టాక్ షోలో పాల్గొన్నారు.. రష్మీ, సుధీర్. 
 
లాక్‌డౌన్‌ తర్వాత సెట్స్‌లోకి అడుగుపెట్టిన రష్మీ, సుధీర్‌లు పలు ఆసక్తికరమైన విషయాలను ఈ షో ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా రష్మీ మాట్లాడుతూ.. సుధీర్ చాలా రొమాంటిక్ అంటూ చెప్పుకొచ్చింది. రొమాంటిక్ అనే డ్రమ్ములో సుధీర్‌ను భగవంతుడు ముంచి తీశాడని తెలిపింది. అతడి రొమాంటిక్ యాంగిల్ చాలా బాగుంటుందన్న రష్మీ.. సుధీర్ చాలా సున్నితమైన వ్యక్తి అని స్పష్టం చేసింది. 
 
అయితే సుధీర్‌కి అతి మంచితనమని.. అదే చిరాకు తెప్పిస్తుందని రష్మీ తెలిపింది. సుధీర్ నిజంగా మంచివాడా.? లేక నటిస్తున్నాడా.? అని డౌట్ వస్తుందని రష్మీ పేర్కొంది. అలాగే తొలిసారి 'జబర్దస్త్' సెట్‌లో కలిశామని చెప్పిన రష్మీ, సుధీర్‌లు.. లాక్ డౌన్ సమయంలో చాలా విషయాలు నేర్చుకున్నామని వివరించారు. రష్మీపైకి చాలా బోల్డ్‌గా, ధైర్యంగా కనిపిస్తుంది గానీ.. లోపల చాలా సెన్సిటివ్ అని.. మనసు చాలా మంచిదని సుధీర్ కితాబిచ్చాడు.