గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 జులై 2020 (19:11 IST)

పవన్ చెదరని నీ నవ్వుకి.. నీ సహనానికి శిరస్సు వంచి నమస్కారాలు.. అలీ (video)

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఎంతో ఇష్టమైన, దగ్గరగా వుండే వ్యక్తి అలీ జనసేనలో కాకుండా వైకాపాలో చేరడం.. పవన్‌తో పాటు అందరినీ కలవరపెట్టింది. అంతేగాకుండా రాజకీయాల్లో ఒకరిపై ఒకరు తీవ్రమైన విమర్శలు సైతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత రెండు రోజుల క్రితం అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్ ట్విట్టర్‌లో ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. 
 
తాజాగా కాగా దీనిపై అలీ తన ట్విట్టర్‌లో స్పందించారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ''వ్యక్తిత్వంలో నిన్ను ఓడించలేనప్పుడు, నీ కులం.. గుణం.. వర్ణం.. గురించి మాట్లాడుతారు. ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించినా చెదరని నీ నవ్వుకి.. నీ సహనానికి శిరస్సు వంచి నమస్కారాలు.'' అంటూ అలీ ట్వీట్ చేశారు. దీనిపై పవర్ స్టార్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.
 
పవన్ కళ్యాణ్, కమెడియన్ అలీ మధ్య స్నేహం గురించి అందరికీ తెలిసిందే. అలీ లేకుంటే తన సినిమాల్లో ఏదో వెలితిగా ఉంటుందని పవన్ కళ్యాణ్ పలు వేదికల మీద కూడా చెప్పారు. ముఖ్యంగా వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'ఖుషీ' సినిమాను పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పటికీ మరిచిపోలేరు. అలాంటి వీరిద్దరూ ఇటీవల రాజకీయాల కారణంగా దూరమైన సంగతి తెలిసిందే.