మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 జులై 2020 (11:48 IST)

సీఎం అధికారిక నివాసంగా మారనున్న వేద నిలయం?

అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అధికారిక నివాసమైన వేద నిలయం తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా మారనుంది. ఈ మేరకు తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 
 
చెన్నైలోని తేనాంపేట, పోయెస్ గార్డెన్‌లో జయలలితకు సొంత ఇల్లు ఉంది. దీనిపేరు వేద నిలయం. జయలలిత చనిపోయిన తర్వాత ఈ ఇంటిని మూసివేసి, పోలీసు భద్రతతో ఉంది. అయితే, ఈ వేద నిల‌యాన్ని.. సీఎం అధికారిక నివాసంగా మార్చాల‌నుకుంటున్న‌ట్లు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌ద్రాసు హైకోర్టుకు విన్న‌వించింది. 
 
మాజీ సీఎం జ‌య‌ల‌లిత‌కు చెందిన స్థిర‌, చ‌ర ఆస్తుల‌ను ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకుంటుంద‌ని అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ విజ‌య్ నారాయ‌ణ్ కోర్టుకు తెలియ‌జేశారు. జ‌స్టిస్ ఆనంద్ వెంక‌టేశ్ ఈ కేసును విచారించారు. జ‌య నివాసాన్ని స్మార‌కంగా మార్చ‌వ‌ద్దు అంటూ దాఖ‌లైన పిటిష‌న్ కేసులో ప్ర‌భుత్వం ఈ వివ‌ర‌ణ ఇచ్చింది. 
 
జ‌య ఇంటిని స్మార‌కంగా మారిస్తే, అప్పుడు అక్క‌డ వేల మంది విజిట‌ర్ల వ‌ల్ల శాంతి క‌రువు అవుతుంద‌ని వేసిన ఓ పిటిష‌న్‌ను అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ త‌ప్పుప‌ట్టారు. ఓ నివాసాన్ని.. స్మార‌కంగా మార్చ‌డం కొత్తేమీ కాదు అని, ప్ర‌జ‌ల మ‌నుసులు గెలుచుకున్న‌ అనేక మంది నేత‌ల కేసుల్లో ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగాయ‌ని జ‌డ్జి వ్యాఖ్యానించారు. 
 
వేద నిల‌యాన్ని స్వాధీనం చేసుకునేందుకు మే నెల‌లో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం తాత్కాలిక ఆదేశాలు జారీ చేసిన విషయం తెల్సిందే. అయితే, జయలలితకు చెందిన ఆస్తులకు వారసులుగా ఆమె అన్న పిల్లలైన దీపా, దీపక్‌లు వారసులంటూ మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెల్సిందే.