సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 15 ఏప్రియల్ 2024 (18:06 IST)

అల్లరి నరేష్ నటించిన ఆ ఒక్కటి అడక్కు విడుదల తేదీ ఫిక్స్

Allari Naresh, Faria
Allari Naresh, Faria
అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ ఆ ఒక్కటి అడక్కుతో ఆకట్టుకోవడానికి సిద్ధం అయ్యారు, ఇప్పటికే విడుదలైన టీజర్ నవ్వుల జల్లులు కురిపించింది,సినిమా పై అంచనాలు పెంచింది. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజీవ్ చిలక నిర్మించిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు మల్లి అంకం దర్శకత్వం వహించారు. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాత. ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన ఫారియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది.
 
ఈ రోజు, మేకర్స్ సినిమా విడుదల తేదీకి సంబంధించిన అప్డేట్ తో ముందుకు వచ్చారు. వేసవి సెలవులను పురస్కరించుకుని మే 3న ఆ ఒక్కటి అడక్కు విడుదల కానుంది. చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ని పూర్తిగా ఫన్ క్యారెక్టర్ లో చూడాలని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ ఒక్కటి అడక్కు ఫుల్ ఆన్ ఎంటర్టైనర్ అవుతుందని అల్లరి నరేష్ వీడియో ద్వారా హామీ ఇచ్చారు.
 
టాలీవుడ్ బిగ్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ ఎల్ పి AP మరియు తెలంగాణ కు సంబందించిన థియేట్రికల్ హక్కులను పొందింది. తెలుగు రాష్ట్రాల్లో వారి బ్యాకప్తో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల కానుంది.
 
సూర్య సినిమాటోగ్రాఫర్ కాగా, గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి అబ్బూరి రవి డైలాగ్స్ ఉన్నాయి. ఈ చిత్రానికి చోటా కె ప్రసాద్ ఎడిటర్ కాగా, జె కె మూర్తి ఆర్ట్ డైరెక్టర్.
 తారాగణం: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, జామీ లివర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ.